హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై దాఖలైన పిల్ ను అత్యవసరంగా విచారించలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ విషయమై హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ ను అత్యవసరంగా స్వీకరించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 

ఈ పిల్ ను అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు తెలిపింది.జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయకుండా స్టే విధించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది.ఈ పిల్  విచారించలేమని తెలిపింది.

also read:డిసెంబర్ 1న పోలింగ్: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ఇదీ...

 జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు విడుదల చేసింది.డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరుగుతోంది. డిసెంబర్ 4వ కౌంటింగ్ నిర్వహించనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయవద్దని కొందరు కోర్టులో పిల్ దాఖలు చేశారు.ఈ పిల్ ను అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై స్టే ఇవ్వలేమని నిన్ననే హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే.