హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

also read:సర్కార్ నుండి నో సిగ్నల్, సమ్మె యధాతథం: ఆశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన రిట్ పిటిషన్లను తెలంగాణ ప్రభుత్వం కొట్టివేసింది. శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నందున రాష్ట్రంలోని 5100 రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ తెలంగాణ  కేబినెట్  ఇటీవల  నిర్ణయం తీసుకొంది.

Also read:ఆర్టీసీ డ్రైవర్ వీరభద్రయ్య మృతి: పరిగి డిపో వద్ద ఉద్రిక్తత

ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోటార్ వాహనాల  చట్టం మేరకు ఆర్టీసీ రూట్ల  ప్రైవేటీకరణ సరైంది కాదని హైకోర్టులో  పిటిషనర్  వాదించారు. అయితే ఈ రిట్ పిటిషన్ ను కొట్టివేస్తూ శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను సమర్ధిస్తూ కేబినెట్ తీర్మాణాన్ని హైకోర్టు సమర్ధించింది. ఎంవీ 1988  చట్టం లోని సెక్షన్ 102 ప్రకారంగా తాము ప్రభుత్వం తీసుకొన్ననిర్ణయంలో  తాము జోక్యం చేసుకోలేమని  హైకోర్టు తేల్చి చెప్పింది.

ఎంవీ1988 చట్టం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి విస్తృతమైన అధికారాలు ఉన్న విషయాన్ని  హైకోర్టు గుర్తు చేసింది. కేబినెట్ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని కూడ హైకోర్టు తేల్చి చెప్పింది.


ఆర్టీసీ  కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను రెండు దఫాలు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ కోరారు. కానీ, ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మెను విరమించలేదు. 

నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఆర్టీసీ సమ్మె విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు వారాల్లో ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలని లేబర్ కోర్టుకు ఆదేశించింది.ఈ పిటిషన్ ను లేబర్ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో భేషరతుగా తమను విధుల్లోకి తీసుకోవాలని జేఎసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. 

కానీ, ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాలేదు. గురువారం నాడు సీఎం కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. కానీ సమ్మెలో ఉన్న కార్మికుల విషయమై ఏం చెప్పలేదు. ఆర్టీసీ విషయమై హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయం తీసుకొన్నారు.

శుక్రవారం నాడు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కూడ తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్నరూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. దీంతో శుక్రవారం నాడు సాయంత్రం సీఎం కేసీఆర్ మరోసారి అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె విషయమై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. శుక్రవారం నాడు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని అధికార పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.