హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు షాకిచ్చింది.శాఖపరమైన విచారణను నిలిపివేయాలని కోరుతూ ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డి,  రాయదుర్గం సీఐ రాంబాబు, నల్లకుంట శ్రీనివాస్  దాఖలు చేసిన  పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి  ఈ ముగ్గురు  పోలీసు అధికారులు సహకరించినట్టుగా  ఈ కేసును విచారించిన పోలీసులు తేల్చారు. ఈ కేసును విచారించిన బంజారాహిల్స్ పోలీసులు ఈ ముగ్గురు పోలీస్ అధికారుల పేర్లను  చార్జీషీట్‌లో చేర్చారు.

Also Read:జయరాం హత్య కేసు: రాకేష్ రెడ్డికి సహకరించిన పోలీసులపై నివేదిక?

చార్జీషీట్‌లో తమ పేర్లు చేర్చడంతో అప్పటి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి,  రాయదుర్గం సీఐ రాంబాబు, నల్లకుంట సీఐ శ్రీనివాస్ లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమపై శాఖపరమైన విచారణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు.

గత ఏడాది జనవరి 31వ తేదీన  ఎన్ఆర్ఐ జయరాం‌ను  రాకేష్ రెడ్డి హత్య చేశాడు. హత్య జరిగిన రోజున రాకేష్ రెడ్డి పోలీసు అధికారులతో మాట్లాడాడు.  రాకేష్ రెడ్డి కాల్ రికార్డ్స్ ఆధారంగా విచారణ అధికారులు  ఈ విషయాన్ని ధృవీకరించారు. పోలీసుల సలహలతోనే జయరాం మృతదేహాన్ని నందిగామకు సమీపంలో వదిలేశారు.

వృత్తిపరంగానే  తాము రాకేష్ రెడ్డితో  మాట్లాడినట్టుగా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులు చెప్పారు. అయితే ఈ వాదనతో విచాణ అధికారులు ఒప్పుకోలేదు. 

జయరామ్ హత్య జరిగినట్టుగా మీడియాలో వార్తలు వచ్చిన సమయంలో  ఎందుకు స్పందించలేదని విచారణ అధికారులు  ప్రశ్నించారు.  ఇద్దరు అధికారులకు రాకేష్ ‌రెడ్డితో ఆర్ధిక సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో  తగిన సాక్ష్యాధారాలు సేకరించినట్టు సమాచారం. 

జయరామ్ హత్య కేసులో పోలీసులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు.  రాకేష్ రెడ్డితో ముగ్గురు పోలీసులను నిందితులుగా చేర్చారు. దీంతో  ఈ ముగ్గురికి రాకేష్ రెడ్డితో ఉన్న సంబంధాలపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం.

ఈ కేసులో ముగ్గురు పోలీసు అధికారుల పేర్లను చార్జీషీట్లో విచారణ అధికారులు పొందుపర్చారు. అయితే ఈ కేసు కారణంగా ఈ ముగ్గురిపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు. అంతేకాదు వారిపై శాఖపరమైన విచారణకు కూడ సిద్దమయ్యారు. అయితే శాఖపరమైన విచారణకు వద్దంటూ ఈ ముగ్గురు కోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను విచారణ చేసిన తర్వాత ఈ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు బుధవారం నాడు హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.జయరామ్ హత్య తర్వాత  విచారణ సమయంలో ఈ ముగ్గురు పోలీస్ అధికారులతో రాకేష్ రెడ్డి మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.