మర్రి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట: నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డికి కోర్టులో ఊరట దక్కింది.

Telangana high Court  quashes  Nagam Janardhan Reddy  Petition  Over  Marri Janardhan Reddy Election Affidavit lns

హైదరాబాద్: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డికి  కోర్టులో ఊరట దక్కింది. మర్రి జనార్ధన్ రెడ్డి  తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని   నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను  హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది.2018  అసెంబ్లీ ఎన్నికల్లో  నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి  మర్రి జనార్ధన్ రెడ్డి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

ఈ సమయంలో ఎన్నికల సంఘానికి తప్పుడు  అఫిడవిట్ ను  మర్రి జనార్ధన్ రెడ్డి సమర్పించారని  నాగం జనార్ధన్ రెడ్డి  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన  తెలంగాణ హైకోర్టు  నాగం జనార్ధన్ రెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది. నాగం జనార్ధన్ రెడ్డి  ఆరోపించినట్టుగా   ఆధారాలు సమర్పించలేదని  ఈ పిటిషన్ ను  కోర్టు కొట్టివేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి నాగం జనార్ధన్ రెడ్డి తనయుడు శశిధర్ రెడ్డి  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014  పార్లమెంట్ ఎన్నికల సమయంలో  మహబూబ్ నగర్  పార్లమెంట్ స్థానం నుండి నాగం జనార్థన్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

2014లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి  నాగం జనార్ధన్ రెడ్డి పోటీ చేసే నాటికి ఆయన  నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు.  2009లో  ఆయన  ఇదే స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత  చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో  టీడీపీకి రాజీనామా చేశారు నాగం జనార్ధన్ రెడ్డి. ఇండిపెండెంట్ గా  ఆయన  నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలో  చేరారు.  మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి జనార్ధన్ రెడ్డి,  నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి  ఆయన తనయుడు శశిధర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

1985లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి నాగం జనార్ధన్ రెడ్డి తొలిసారిగా టీడీపీ అభ్యర్ధిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టారు.1989లో  నాగం జనార్ధన్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో  ఓటమి పాలయ్యారు. 1994 నుండి 2009 వరకు టీడీపీ అభ్యర్ధిగా  ఇదే స్థానం నుండి ఆయన ప్రాతినిథ్యం వహించారు.  2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా  నాగం జనార్ధన్ రెడ్డి  విజయం సాధించారు. 2018   ఎన్నికల్లో  నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేసి  బీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి జనార్ధన్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios