అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో విధుల నుండి  పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జిని విధుల నుండి తప్పిస్తూ హైకోర్టు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 

పెద్దపల్లి: పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి బాలచందర్‌ను సర్వీస్ నుండి తొలగిస్తూ హైకోర్టు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

మేడ్చల్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ గా బాలచందర్ ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై హైకోర్టు విచారణ జరిపించింది. ఈ ఆరోపణలు రుజువు కావడంతో బాలచందర్‌ను సర్వీసుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.