నల్గొండ:  కోర్టు ధిక్కరణ కేసులో  నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు  తెలంగాణ హైకోర్టు ఆసక్తికర శిక్షను విధించింది.

ప్రతి వారం 2 గంటల పాటు అనాధ ఆశ్రమంలో రెండు గంటల పాటు గడపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు మాసాల పాటు ఇదే శిక్షను కొనసాగించాలని ఆదేశించింది. మరోవైపు కోర్టు ధిక్కరణ కేసులో మరో అధికారిణి సంధ్యారాణికి కూడ హైకోర్టు ఇదే తరహా శిక్షను అమలు చేసింది. 

ఉగాది,శ్రీరామనవమికి అనాథ ఆశ్రమంలో వారికిభోజనాలు సమకూర్చాలని ఆదేశించింది.అనాధఆశ్రమంలో రెండు గంటల పాటు కలెక్టర్ గడిపితే ఆయా సంస్థల్లో సౌకర్యాలు కూడ మెరుగుపడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

గతంలో ఓ కేసుకు సంబందించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జిల్లా అధికారులు బేఖాతర్ చేశారు. దీంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో  తెలంగాణ హైకోర్టు కలెక్టర్ కు ఈ శిక్షను విధించింది. కలెక్టర్ తో పాటు మరో అధికారికి కూడ ఇదే తరహా శిక్ష విధించడం గమనార్హం.