Asianet News TeluguAsianet News Telugu

భార్యకు చెప్పకుండా భర్త అంత్యక్రియలు: హైకోర్టుకు తెలంగాణ సర్కార్ చెప్పింది ఇదీ...

కరోనాతోనే వనస్థలిపురానికి చెందిన మధుసూధన్ మరణించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.మధుసూధన్ భార్య మాధవి దాఖలు చేసిన హెబియస్ కార్ఫస్ పిటిషన్ పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. 

Telangana high court orders to give death certificate to madhusudhan family members
Author
Hyderabad, First Published Jun 5, 2020, 3:31 PM IST

హైదరాబాద్: కరోనాతోనే వనస్థలిపురానికి చెందిన మధుసూధన్ మరణించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.మధుసూధన్ భార్య మాధవి దాఖలు చేసిన హెబియస్ కార్ఫస్ పిటిషన్ పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. 

కరోనా కారణంగానే మధుసూధన్ మరణించాడని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హైకోర్టుకు నివేదించింది. మధుసూధన్ కు చెందిన చితాభస్మం, డెత్ సర్టిఫికెట్ కూడ ఉన్నాయని ప్రభుత్వం  తెలిపింది. 

చితాభస్మంతో పాటు డెత్ సర్టిఫికెట్ ను కుటుంబసభ్యులకు అప్పగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. 

మధుసూధన్ ఆసుపత్రిలో చేరిన రోజునే అతని తండ్రి ఈశ్వరయ్య కూడ కరోనాతో మరణించాడని వైద్య ఆరోగ్య శాఖ ఇదివరకే ప్రకటించింది. మరో వైపు మధుసూధన్ భార్య కూడ కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో మధుసూధన్ మరణించిన విషయం చెప్పలేదని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. 

also read:మధుసూధన్ చనిపోయాడా లేదా రేపటిలోపుగా చెప్పండి: ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగి మధుసూధన్ మరణంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. తన భర్త మధుసూదన్ ఆచూకీ తెలియడం లేదని  మధుసూధన్ భార్య మాధవి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు గత నెల 21వ తేదీన ఫిర్యాదు చేసింది.

Telangana high court orders to give death certificate to madhusudhan family members

మధుసూదన్ మే 1వ తేదీన గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. గాంధీ ఆసుపత్రి సిబ్బంది సూచన మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మధుసూధన్ అంత్యక్రియలను నిర్వహించారు.

మధుసూధన్ తండ్రి ఈశ్వరయ్య కూడ కరోనాతో మరణించాడు. మధుసూధన్ భార్య మాధవి కూడ ఇదే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొంది.ఆసుపత్రిలో కోలుకొంటున్న మాధవికి భర్త చనిపోయిన విషయాన్ని చెప్పలేదని మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 21వ తేదీన స్పష్టం చేశారు.

అయితే ఈ విషయమై ప్రభుత్వం చెప్పిన సమాధానంతో మాధవి తృప్తి చెందలేదు. న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించింది.ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించింది. మధుసూధన్ మరణించారా లేదా అనే విషయాన్ని ఈ నెల 5వ తేదీ లోపుగా చెప్పాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీంతో ఇవాళ హైకోర్టుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మధుసూధన్ మృతిపై నివేదికను ఇచ్చింది. ఈ నివేదికపై ఈ నెల 9వ తేదీన హైకోర్టు విచారణ చేయనుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios