హైదరాబాద్: జంటనగరాల్లో వరద సహాయం పంపిణీ నిలిపివేత విచారణను డిసెంబర్ 4వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

హైద్రాబాద్ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిలిచిపోయిన రూ. 10 వేల నగదు పంపిణీని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణను ప్రారంభించింది.

also read:మాపై తప్పుడు ప్రచారం, కేసీఆర్‌కు అదే భయం: భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బండి సంజయ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో  నగదు పంపిణీని నిలిపివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వరద ప్రభావం ఈ సమయంలో పంపిణీ చేస్తే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆదేశించినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదన తెలుసుకోకుండా ఈ విషయమై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీ లోపుగా ప్రభుత్వం  కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.  ఈ కేసు విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. బీజేపీ ఫిర్యాదు మేరకు వరద సహాయాన్ని ఈసీ నిలిపివేసిందని కేసీఆర్ ఆరోపించారు. ఈ విషయమై తాను ఎన్నికల సంఘానికి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.