ఈ నెల 20వ తేదీ వరకు తెలంగాణలోని అన్ని విద్యా సంస్తల్లో కూడా ఆన్‌లైన్ తరగతులను కూడా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: ఈ నెల 20వ తేదీ వరకు Education institutesల్లో Online క్లాసులు కూడా బోధించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్ క్లాసులను కూడా కొనసాగించాలని కూడా Telangana High Court ఆదేశించింది.కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా హైకోర్టు విద్యాసంస్థల్లో ఆన్ లైన్ తరగతులను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద Corona నిబంధనలను అమలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. సమ్మక్క, సారక్క జాతరలో కూడా కరోనా నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు సూచించింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై ఈ నెల 20వ తేదీన విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు తెలిపింది.
కరోనాను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది జనవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు తెలంగాణోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం Holidays ఇచ్చింది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల 17 నుండి ఈ నెల 31వ తేదీ వరకు సెలవులను పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆన్‌లైన్ క్లాసులతో విద్యార్ధులకు లాభం కంటే నస్టమే ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్న తరుణంలో విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి విద్యా సంస్థలను పున: ప్రారంభించింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడంతో ఆన్ లైన్ క్లాసులను కూడా కొనసాగించాలని ఇవాళ హైకోర్టు ఆదేశించింది.ఆన్ లైన్ క్లాసుల కారణంగా విద్యార్ధులకు పాఠాలు సరిగా అర్ధం కాలేదని ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలతో తేట తెల్లమైందని విద్యా వేత్తలు చెబుతున్నారు. ఆన్ లైన్ క్లాసుల కంటే ఆఫ్ లైన్ క్లాసులను నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది.
