సంచార కరోనా పరీక్షలు ఎందుకు వీలుకాదు: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు

కరోనాపై కీలక సమాచారం మీడియా బులెటిన్ లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని కూడ సూచించింది.
 

Telangana High court orders to conduct corona tests entire state

హైదరాబాద్: కరోనాపై కీలక సమాచారం మీడియా బులెటిన్ లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని కూడ సూచించింది.

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న  వైద్యులకు పీపీఈ కిట్లు, మాస్కులు, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్ పై బుధవారం, గురువారాల్లో తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.

also read:సరోజిని కంటి ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లకు కరోనా

రాష్ట్రంలోని 79 మంది వైద్యులకు కరోనా సోకిందని  ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కోర్టుకు వెల్లడించారు.గాంధీలో ప్లాస్మా, యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రయోగాలు చేస్తున్నట్టుగా రాజారావవు కోర్టుకు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కేసుల వివరాలు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది.

కేసుల వివరాలు ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ర్యాపిడ్ యాంటిజెంట్ టెస్ట్ నిర్వహించాలంటూ ఐసీఎంఆర్ చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.

సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం వివరించాలని హైకోర్టు ఆదేశించింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో పాటు పోలీసులకు కూడ రక్షణ కిట్లను కూడ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 29వ తేదీలోపుగా నివేదికను సమర్పించాలని తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios