Asianet News TeluguAsianet News Telugu

వినాయక విగ్రహల నిమజ్జనం: హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహలను నిమజ్జనం చేయవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరో వైపు హుస్సేన్ సాగర్ లో రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసి అందులోనే వినాయక విగ్రహలను నిమజ్జనం చేయాలని కోరింది.

Telangana High court orders to build rubber dam at Hussain sagar for ganesh idol immersion
Author
Hyderabad, First Published Sep 9, 2021, 11:21 AM IST


హైదరాబాద్: హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేక కుంటల్లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించింది.

 

హుస్సేన్ సాగర్ లో ప్రత్యేకంగా  రబ్బర్ డ్యామ్ ను ఏర్పాటు చేయాలని కూడ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రబ్బర్ డ్యామ్  పరిధిలోనే వినాయక విగ్రహలను నిమజ్జనం చేయడానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై  న్యాయవాది వేణు మాధవ్ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.ఈ పిల్ పై పిటిషనర్ తో పాటు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల వాదనలను విన్న ఉన్నత న్యాయస్థానం ఇవాళ కీలక ఆదేశాలను వెల్లడించింది. 

చిన్న విగ్రహలతో పాటు పర్యావరణానికి హాని కలిగించని విగ్రహల తయారీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఆంక్షలను అమలు చేయాలని కూడ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ట్యాంక్‌బండ్ పై నిమజ్జనానికి అనుమతించవద్దని కూడ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. తమ ఆదేశాలను ప్రభుత్వం, జీహెచ్ఎంసీ , పోలీస్ శాఖలు కచ్చితంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.

గణేష్ మండపాల వద్ద ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది హైకోర్టు. రాత్రి 10 గంటల తర్వాత మైకులకు అనుమతిని ఇవ్వవద్దని కూడ తేల్చి చెప్పింది ఉన్నత న్యాయస్థానం. భక్తులు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చూడాలని హైకోర్టు సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios