Asianet News TeluguAsianet News Telugu

బీఎల్ సంతోష్ కి మరోసారి నోటీసులివ్వాలి: సిట్ కి తెలంగాణ హైకోర్టు ఆదేశం

బీజేపీ  అగ్రనేత  బీఎల్  సంతోష్ కు  మరోసారి  మెయిల్  ద్వారా  నోటీసులు  పంపాలని  తెలంగాణ  హైకోర్టు  సిట్ ను ఆదేశించింది.  ఇవాళ  తెలంగాణ  హైకోర్టు  ఈ విషయమై  విచారణ  నిర్వహించింది. 

Telangana High Court orders SIT To give notice to BJP Leader BL Santosh
Author
First Published Nov 23, 2022, 3:18 PM IST

హైదరాబాద్:బీజేపీ  అగ్రనేత   బీఎల్  సంతోష్ కు  మరోసారి  మెయిల్  ద్వారా  41 సీఆర్‌పీసీ  సెక్షన్ కింద నోటీసులివ్వాలని  తెలంగాణ హైకోర్టు  బుధవారంనాడు  సిట్ ను ఆదేశించింది.ఇవాళ మధ్యాహ్నం విచారణ ప్రారంభం  కాగానే  సుప్రీంకోర్టు తీర్పు కాపీని  హైకోర్టు  బెంచ్  ముందుంచారు.  ఈ  తీర్పు  కాపీని పరిశీలించిన  తర్వాత హైకోర్టు  విచారణను ప్రారంభించింది.  ఈ  కేసుతో సంబంధం  ఉన్నవారందరికి  నోటీసులు జారీ చేస్తున్నామని అడ్వకేట్  జనరల్  హైకోర్టుకు  తెలిపారు.

ఇవాళ మధ్యాహ్నం విచారణ ప్రారంభం  కాగానే  సుప్రీంకోర్టు తీర్పు కాపీని  హైకోర్టు  బెంచ్  ముందుంచారు.  ఈ  తీర్పు  కాపీని పరిశీలించిన  తర్వాత హైకోర్టు  విచారణను ప్రారంభించింది.  ఈ  కేసుతో సంబంధం  ఉన్నవారందరికి  నోటీసులు జారీ చేస్తున్నామని అడ్వకేట్  జనరల్  హైకోర్టుకు  తెలిపారు.

బీఎల్  సంతోష్ ను  అరెస్ట్  చేయవద్దని  ఉన్న  ఆర్డర్ ను  ఎత్తివేయాలని అడిషనల్  ఏజీ  హైకోర్టును  కోరారు. అయితే  అడిషనల్  ఏజీ  అభ్యర్ధనను  మాత్రం హైకోర్టు  నిరాకరించింది. పూర్తి వివరాలతో  కౌంటర్  దాఖలు  చేయాలని హైకోర్టు  కోరింది. తదుపరి  విచారణను  ఈ నెల  30వ  తేదీకి  వాయిదా  వేసింది హైకోర్టు. ప్రభుత్వం  తరపున అడ్వకేట్  జనరల్ , సిట్  తరపున  అడిషనల్  అడ్వకేట్ జనరల్  ఈ  కేసు విషయమై  వాదించారు. 41  ఏ సీఆర్‌పీసీ  సెక్షన్  కింద  ఇచ్చిన  నోటీసు  విషయమై నిందితుడికి  సరైన  సమయం  ఇవ్వాలని  కూడా  హైకోర్టు సూచించింది.  నేచురల్  జస్టిస్  కు  విరుద్దంగా వ్వవహరించవద్దని  కూడా హైకోర్టు  ఆదేశించింది.  దీంతో  తాజాగా  ఈ మెయిల్ , వాట్సాప్ ల  ద్వారా మరోసారి  బీఎల్  సంతోష్ కు  41 ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు  ఇవ్వాలని కూడా హైకోర్టు  ఆదేశించింది.

సిట్  విచారణకు  ఏ రోజున  బీఎల్  సంతోష్  హాజరు కానున్నారో  తమకు  తెలపాలని కూడా  హైకోర్టు  కోరింది.  ఈ  కేసును  సీబీఐ లేదా  కోర్టు  నేతృత్వంలోని  ప్రత్యేక  బృందంతో  విచారణ  చేయించాలని  గతంలోనే  బీజేపీ  పిటిషన్  దాఖలు  చేసింది.  ఈ  విషయమై ఈ నెల  30వ  తేదీన  విచారణ  చేస్తామని  హైకోర్టు  తెలిపింది. మరోవైపు  ఏ  విచారణ సంస్థ ద్వారా  విచారణ  చేస్తారో  ఆ  ఏజేన్సీ  ద్వారా  నోటీసులు  ఇప్పించాలని  కూడా బీజేపీ  తరపు న్యాయవాదులు కోరారు.  

also  read:సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూశాకే విచారణ:టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టు

ఈ  ఏడాది అక్టోబర్  26న  మొయినాబాద్  ఫాం హౌస్ లో టీఆర్ఎస్  ఎమ్మెల్యేలను  ప్రలోభాల  కేసులో  ముగ్గురిని  పోలీసులు  అరెస్ట్ చేశారు.  అచ్చంపేట  ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు,  కొల్లాపూర్  ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్ రెడ్డి,  పినపాక  ఎమ్మెల్యే  రేగా  కాంతారావు.  తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్  రెడ్డిలను  ప్రలోభాలకు  గురి చేశారని కేసు  నమోదైంది. ఈ కేసలో రామచంద్రభారతి, సింహయాజీ,  నందకుమార్ లను  పోలీసులు  అరెస్ట్  చేశారు. రామచంద్రభారతి ఎమ్మెల్యేలతో  సంభాషణల్లో సంతోష్  పేరు  ప్రస్తావించారు. దీంతో  సిట్  ఆయనకు నోటీసులు  ఇచ్చారు. 

 

 

 

Follow Us:
Download App:
 • android
 • ios