తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ అలోక్ అరదే నియామకం కానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. గురువారం ఈ సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించే అవకాశం ఉన్నది.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియామకం కాబోతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు బుధవారం రాత్రి సిఫార్సు చేసింది. బహుశా గురువారం ఈ సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఇప్పటికే సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉద్యోగోన్నతి కల్పించినందున ఈ స్థానంలో నూతన సీజేగా అలోక్ అరదేను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం అధికారిక ప్రకటనలో గురువారం తెలిపింది.
Also Read: KA Paul: కేసీఆర్ నాకు భయపడ్డాడు.. ఆ పార్టీలన్నీ ఒక్కటే.. నేనే ప్రధాన ప్రతిపక్షం
జస్టిస్ అలోక్ అరదే 2009 డిసెంబర్ 29వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ నుంచి ఆయన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు పెద్ద హైకోర్టుల్లో 13 ఏళ్లు అనుభవం జస్టిస్ అలోక్ అరదేకు ఉన్నది.
