Asianet News TeluguAsianet News Telugu

ఆ సాక్ష్యాలు సీఎంకు ఎవరిచ్చారు: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగిస్తూ  తెలంగాణ హైకోర్టు  నిన్న కీలక తీర్పు ఇచ్చింది.  ఈ తీర్పులో  కీలక అంశాలను హైకోర్టు ప్రస్తావించింది. 

Telangana high court  key comments  On  Brss MLAs  poaching case
Author
First Published Dec 27, 2022, 9:42 AM IST

హైదరాబాద్:  ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  సీఎంకు  సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో  సిట్  విఫలమైందని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ఎమ్మెల్యేల  ప్రలోభాల కేసు( కొనుగోలు) ను సీబీఐకి అప్పగిస్తూ  తెలంగాణ హైకోర్టు  సోమవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.  ఈ తీర్పు కాపీలో  కీలక అంశాలను  తెలంగాణ హైకోర్టు  ప్రస్తావించింది.  ఈ కేసుకు సంబంధించిన  దర్యాప్తు సమాచారం  సీఎంకు చేరవేతపై  హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. దర్యాప్తు అధికారుల వద్ద ఉండాల్సిన  ఆధారాలు ప్రజలకు చేరిపోయినట్టుగా హైకోర్టు తెలిపింది.  దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో  సహా  ఎవరికీ కూడా చెప్పకూడదని హైకోర్టు తెలిపింది.ఈ కేసు దర్యాప్తు  ప్రారంభదశలోనే కీలక ఆధారాలు బహిర్గతమైనట్టుగా  హైకోర్టు  వివరించింది సిట్  దర్యాప్తు  ఫెయిర్  ఇన్విస్టిగేషన్ లా అనిపించడం లేదని  హైకోర్టు అభిప్రాయపడింది.దర్యాప్తు ఆధారాలు బహిర్గతం కావడంతో  విచారణ సక్రమంగా జరగదని  హైకోర్టు ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ  కథనం ప్రసారం చేసింది. జీవో 63 ద్వారా  ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసింది  తెలంగాణ హైకోర్టు., అంతేకాదు  ఎఫ్ఐఆర్  455/2022 ను సీబీఐకి బదిలీ చేస్తూ  ఆదేశాలు జారీ చేసిందని  ఆ కథనంలో వివరించింది .

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని కోరుతూ  బీజేపీ సహా ఐదుగురు పిటిషన్లు దాఖలు చేశారు.  ఈ పిటిషన్లపై  ఈ నెల  16వ తేదీ వరకు  వాదనలను  హైకోర్టు వింది.  తీర్పును రిజర్వ్  చేసింది.  ఈ విషయమై  నిన్న హైకోర్టు తీర్పును విడుదల చేసింది. ఈ కేసు విచారణను సీబీఐకి ఇస్తూ తెలంగాణ హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.   ఈ సందర్భంగా  జడ్జిమెంట్  కాపీలో  కీలక అంశాలను  ప్రస్తావించినట్టుగా  ఆ కథనం తెలిపింది.

also read:బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు అనుమతి

ఈ కేసును సీబీఐతో  విచారణకు అప్పగించాలని  దాఖలు చేసిన ఐదు పిటిషన్లలో  మూడు పిటిషన్లను  హైకోర్టు అనుమతించింది. రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. బీజేపీ సహా మరొకరు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది అక్టోబర్ 26న   మోయినాబాద్ ఫాం హౌస్ లో  నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలతో  ముగ్గురిని మొయినాబాద్ పోలీసులు  అరెస్ట్  చేశారు.అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,  కొల్లాపూర్ ెమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,  పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులను ప్రలోభాలకు గురి చేశారని  పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్రభారతి,  సింహాయాజీ, నందకుమార్ లను  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఈ కేసులో  నిందితులకు  బెయిల్  మంజూరు చేసింది.  


 

Follow Us:
Download App:
  • android
  • ios