ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్: ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను అక్బరుద్దీన్‌‌ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు అక్బరుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది.

2012 లో నిజామాబాద్‌లో జరిగిన ఓ సభలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అక్బరుద్దీన్‌ బెయిల్ వచ్చింది. ఈ కేసులో అక్బరుద్దీన్ కు బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో బెయిల్‌పై ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఓ పిటిషన్ దాఖలైంది.

అక్బరుద్దీన్ ఓవైసీ కి ఉన్న బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ విషయమై దాఖలైన పిటిషన్‌పై అక్బరుద్దీన్‌ కు, సీఐడీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఈ నోటీసులకు ఏం సమాధానం చెబుతారనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది.