జర్నలిస్టులకు రూ. 25 వేలు ఇవ్వాలి: ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

ప్రాణాలను ఫణంగా పెట్టి వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని హైకోర్టులో న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.
 

telangana High court issues notice to government over journalists problems


కరోనా కవరేజీలో ఉన్న జర్నలిస్టులకు రూ. 25 వేలు ఇవ్వాలి: ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు 

హైదరాబాద్: ప్రాణాలను ఫణంగా పెట్టి వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని హైకోర్టులో న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది.

also read:రైళ్లు ఇప్పుడే నడపొద్దు, వ్యాక్సిన్ హైద్రాబాద్ నుండే: మోడీతో కేసీఆర్

ఈ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది మాచర్ల రంగయ్య తన వాదనలను విన్పించారు. లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.

రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ. 25 వేలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అంతేకాదు కరోనా వార్తలను కవర్ చేస్తున్న  ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కూడ పిటిషనర్ కోరారు. జర్నలిస్టులకు మెడికల్ కిట్స్, మాస్కులను ఉచితంగా ఇవ్వాలని కోరారు.

ఈ విషయమై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ లకు హైకోర్టు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రకటించారు.

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసుల కవరేజీ విషయంలో జర్నలిస్టులకు ఆంక్షల విషయంలో సడలింపులు ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios