Asianet News TeluguAsianet News Telugu

సచివాలయం కూల్చివేతపై విచారణ మంగళవారానికి వాయిదా

సచివాలయం భవనాల కూల్చివేత పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కూల్చివేతపై ప్రభుత్వం తరపు నుంచి  ప్రభుత్వ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించగా.. పిటిషనర్ తరపున చిక్కుడు ప్రభాకర్ వాదించారు.

Telangana high court hearing secretariat demolition petition
Author
Hyderabad, First Published Oct 14, 2019, 8:53 PM IST

సచివాలయం భవనాల కూల్చివేత పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కూల్చివేతపై ప్రభుత్వం తరపు నుంచి  ప్రభుత్వ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించగా.. పిటిషనర్ తరపున చిక్కుడు ప్రభాకర్ వాదించారు.

సచివాలయంలో నిర్మాణం పై క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, భావనాల కూల్చివేత పై ఇప్పటికే ప్రభుత్వం కమిటీని వేసిందని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవని, సరైన పార్కింగ్ కూడా లేదని తెలిపిన ఆయన.. కమిటీ ఇచ్చిన నివేదికను హైకోర్టుకు సమర్పించారు.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కొనసాగిన సచివాలయంలో ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారని పిటిషన్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.

సచివాలయంలో 7 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలను కూడా కూల్చివేస్తున్నారని, నూతన సచివాలయ నిర్మాణం వలన వందల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్ట్ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది

Follow Us:
Download App:
  • android
  • ios