Asianet News TeluguAsianet News Telugu

భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

భైంసాలో  ఆర్ఎస్ఎస్ ర్యాలీకి  తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది.   పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడంతో  ఆర్ఎస్ఎస్ నేతలు  కోర్టును ఆశ్రయించారు.  

Telangana High Court  Green Signals To  RSS  Rally in Baisa
Author
First Published Feb 28, 2023, 2:48 PM IST

హైదరాబాద్: భైంసాలో  ఆర్ఎస్ఎస్ ర్యాలీకి  తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు అనుమతిని ఇచ్చింది. శాంతిభద్రతలకు  విఘాతం కలగకుండా  ర్యాలీ నిర్వహించాలని  హైకోర్టు ఆదేశించింది.  ప్రార్ధనా స్థలానికి  300 మీటర్ల దూరం వరకే  అనుమతిని ఇచ్చింది  హైకోర్టు.   ర్యాలీలో  500 మందికి మాత్రమే  హైకోర్టు అనుమతిని ఇచ్చింది.

ఎలాంటి నేరచరిత్ర లేనివారే  ర్యాలీలో  పాల్గొనాలని హైకోర్టు ఆదేశించింది.  ప్రార్ధన మందిరం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు  చేయాలని  పోలీసులకు హైకోర్టు సూచించింది. ర్యాలీలో  పాల్గొన్నవారు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని కూడా  హైకోర్టు  కోరింది.  

ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా  ఆర్ఎస్ఎస్ ర్యాలీకి  అనుమతిని  నిరాకరించినట్టుగా  ప్రభుత్వ  తరపు న్యాయవాది చెప్పారు. ఇంటలిజెన్స్ నివేదికను  హైకోర్టుకు  ప్రభుత్వ తరపు న్యాయవాది అందించారు.  

రెండేళ్ల  క్రితం బైంసా లో  జరిగిన అల్లర్ల విషయాన్ని  ప్రబుత్వ న్యాయవాది  కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  బైంసా అత్యంత సున్నిత ,ప్రాంతంగా  ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.  
టిప్పు సుల్తాన్ బర్త్ డే ర్యాలీరి సైతం పోలీసులు అనుమతి ఇచ్చారని పిటిషనర్ వాదనలు విన్పించారు. బైంసా భారత దేశంలోనే ఉందని పిటిషన్ వాదించారు.   ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత  ర్యాలీకి  హైకోర్టు సుముఖతను తెలిపింది.

 భైంసాలో  ర్యాలీకి  ఆర్ఎస్ఎస్ నేతలు  పోలీసులకు ధరఖాస్తు  చేసుకున్నారు. అయితే శాంతి భద్రతల  సమస్య తలెత్తే అవకాశం ఉందని  ఈ ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు.దీంతో ఈ నెల  20వ తేదీన ఆర్ఎస్ఎస్ నేతలు  ర్యాలీకి అనుమతి కోసం  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు. 

also read:భైంసాలో ర్యాలీకి అనుమతి నిరాకరణ: హైకోర్టును ఆశ్రయించిన ఆర్ఎస్ఎస్

  ఈ నెల  20వ తేదీన  ర్యాలీ నిర్వహించే  రూట్ మ్యాప్ ను కూడా సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ర్యాలీకి  ఎందుకు  అభ్యంతరం తెలుపుతున్నారని  పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.  భైంసాలో  గతంలో  చోటు  చేసుకున్న ఉదంతాలను దృష్టిలో ఉంచుకొని  ర్యాలీకి అనుమతిని నిరాకరించినట్టుగా  ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత  ఆర్ఎస్ఎస్ ర్యాలీకి  తెలంగాణ హైకోర్టు  అనుమతిని ఇచ్చింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios