భైంసాలో ర్యాలీకి అనుమతి నిరాకరణ: హైకోర్టును ఆశ్రయించిన ఆర్ఎస్ఎస్

భైంసాలో  ఆర్ఎస్ఎస్ ర్యాలీకి  అనుమతి నిరాకరించారు నిర్మల్ పోలీసులు.దీనిపై  ఆర్ఎస్ఎస్ నేతలు  హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు

RSS Files Petition For seeking Permission Rally in Bhainsa

హైదరాబాద్: భైంసా లో  అర్ ఎస్ ఎస్  ర్యాలీ కి అనుమతి నిరాకరించారు.  ఈ విషయమై  ఆర్ఎస్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  భైంసా లో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరించారు  నిర్మల్ పోలీసులు. దీంతో ఆర్ఎస్ఎస్ నేతలు  హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.  ఆర్ఎస్ఎస్  ర్యాలీ  రూట్  మ్యాప్ ను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు   పిటిషనర్ ను ఆదేశించింది.

.ఆర్టికల్ 19 ప్రకారం సభలు, ర్యాలీలు ఎవరైనా నిర్వహించవచ్చని  హైకోర్టు  తెలిపింది.  అయితే   శాంతిభద్రతల  సమస్యలు  ఉత్పన్నమయ్యే   అవకాశం ఉన్నందునే  ఆర్ఎస్ఎస్ ర్యాలీనికి  అనుమతిని నిరాకరించినట్టుగా  ప్రభుత్వ  న్యాయవాది  హైకోర్టు తెలిపారు. ర్యాలీ కి అనుమతి ఇస్తే శాంతి భద్రత సమస్య వస్తోందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని  ప్రభుత్వ అడ్వకేట్  తెలిపారు.గడిచిన రెండు సంవత్సరాల్లో ఆర్ ఎస్ ఎస్ ర్యాలీ వల్ల 15 రోజుల పాటు కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చిన విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది ఈ సందర్భంగా  గుర్తు  చేశారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios