హైదరాబాద్:


హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డికి  హైకోర్టు  మంగళవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.

ఇదే కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.భార్గవ్ రామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడికి కూడ బెయిల్ మంజూరైంది.ఇదే కేసులో ఉన్న సిద్దార్ద మల్లిఖార్జున్ రెడ్డికి బెయిల్ దక్కింది.ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు.

also read:బోయిన్ పల్లి కిడ్నాప్: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి

వీరిద్దరికి సికింద్రాబాద్ కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ చేసిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఈ ఏడాది జనవరి 22వ తేదీన భార్గవ్ రామ్, ఈ ఏడాది జనవరి 30న భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.

బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులను భూమా కుటుంబం కిడ్నాప్ చేసింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు.