హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని నేరేడ్ మెట్ డివిజన్ ఫలితాలను వెల్లడికి తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్రలున్న ఓట్లు పరిగణనలోకి తీసుకొనేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.నేరేడ్‌మెట్ డివిజన్ పరిధిలో 544 బ్యాలెట్ పేపర్లపై ఇతర ముద్రలున్నాయి. ఈ ముద్రలను పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

నేరేడ్ మెట్ డివిజన్ పరిధిలో  ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్ధి 504 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర ముద్రలు ఉన్న వాటిని కూడ పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.హైకోర్టు తీర్పుతో నేరేడ్ మెట్ డివిజన్ ఫలితం వెల్లడికానుంది.

స్వస్తిక్ ముద్ర ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందున హైకోర్టు ఆదేశం మేరకు ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి హైకోర్టుకు నివేదించారు. దీంతో ఈ నెల 4వ తేదీన ఈ డివిజన్ ఫలితాన్ని వెల్లడించలేదు. హైకోర్టు ఆదేశాలతో ఇవాళ ఇతర ముద్రలు ఉన్న బ్యాలెట్ పేపర్లను కూడ లెక్కించనున్నారు.