Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు ఊరట: ఈ నెల 13 వరకు సిట్ నోటీసులపై స్టే

బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్,  జగ్గుస్వామిలకు  తెలంగాణ హైకోర్టులో  ఊరట లభించింది.  ఈ  నెల 13వ తేదీ వరకు వీరిద్దరికి సిట్ నోటీసులపై స్టే ఇచ్చింది  హైకోర్టు.

Telangana High  Court Extends   BJP Leader BL Santosh Stay Till December  13
Author
First Published Dec 5, 2022, 4:10 PM IST

హైదరాబాద్: బీజేపీ అగ్రనేత  బీఎల్ సంతోష్ కి  సిట్  జారీ చేసిన నోటీసులపై స్టేను  ఈ నెల 13వ తేదీవరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఇదే కేసులో  కేరళకు చెందిన జగ్గుస్వామి దాఖలు చేసిన  పిటిషన్ పై కూడా  ఈ  నెల 13వ తేదీ వరకు  స్టేను  విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

గత నెలలో  బీఎల్ సంతోష్  సిట్  ఇచ్చిన నోటీసులను సవాల్  చేస్తూ దాఖలు చేసిన పిటిషన్  పై  తెలంగాణ హైకోర్టు ఈ నెల  5వ తేదీ వరకు  స్టే ఇచ్చింది. ఇవాళ్టితో  స్టే  ముగియనుంది.  దీంతో  ఇవాళ  ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. బీఎల్  సంతోష్ కు సిట్  జారీ చేసిన నోటీసులపై  తెలంగాణ హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది.

టీఆర్ఎస్  ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో  బీజేపీ అగ్రనేత  బీఎల్ సంతోష్ కు గత నెలలో  సిట్  అధికారులు రెండు దఫాలు నోటీసులు పంపారు.గత నెల 21న విచారణకు రావాలని కోరారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశం  మేరకు గత  నెల 23న మరోసారి  నోటీసులు పంపింది హైకోర్టు. దీంతో  ఈ  నోటీసులపై  తెలంగాణ హైకోర్టులో బీఎల్ సంతోష్  గత నెల 25న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన  హైకోర్టు  బీఎల్ సంతోష్ కి   సిట్  జారీ చేసిన నోటీసులపై డిసెంబర్ 5 వ తేదీ వరకు స్టే విధించింది. ఇవాళ్టితో  స్టే ముగియనుంది. దీంతో ఇవాళ ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు స్టేను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ  ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే ఇదే  కేసులో  తనకు ఇచ్చిన  41సీఆర్‌పీసీ నోటీసులతో పాటు, లుకౌట్ నోటీసులపై స్టే కోరుతూ ఈ నెల 3వ తేదీన   జగ్గుస్వామి  తెలంగాణ హైకోర్టులో   పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్  పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ నిర్వహించింది..జగ్గుస్వామికి  కూడ సిట్ నోటీసులపై ఈ  నెల 13వ తేదీ వరకు స్టే విధిస్తూ  ఆదేశాలు జారీ చేసింది.

also read:కేరళకు సిట్ అధికారులు.. మరోసారి తుషార్, జగ్గుస్వామిలకు నోటీసులు..

ఈ ఏడాది అక్టోబర్  26న మొయినాబాద్ ఫాంహౌస్ లో   టీఆర్ఎస్  ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్  చేశారు. ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏపీకి చెందిన సింహాయాజీ, హైద్రాబాద్ కు చెందిన  నందకుమార్ లను మొయినాబాద్  పోలీసులు అరెస్ట్  చేశారు.  తాండూపు ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ  ముగ్గురిని అరెస్ట్  చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక  ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్  రెడ్డి, తాండూరు ఎమ్మెల్యేలను  ఈ  ముగ్గురు ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్  రెడ్డి ఫిర్యాదు  మేరకు ఈ  కేసు నమోదైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios