ఎర్రమంజిల్ కూల్చివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎర్ర మంజిల్ కూల్చివేసి కొత్ అసెంబ్లీ భవనం నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత అసెంబ్లీలో అన్ని సౌకర్యాలు ఉంటే కొత్త భవనం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది.
హైదరాబాద్: ప్రస్తుతమున్న అసెంబ్లీలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పటికీ ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించాల్సిన అవసరం ఏముందని తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఎర్రమంజిల్ కూల్చివేత, కొత్త అసెంబ్లీ నిర్మాణాలను నిరసిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం నాడు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎర్రమంజిల్ కూల్చివేసి కొత్త అసెంబ్లీ భవన నిర్మాణ: కోసం హెచ్ఎండీఏ అనుమతి తీసుకొన్నారా అని హైకోర్టు ప్రశ్నించింది.
కొత్త భవనం నిర్మాణం కోసం అనుమతులు తీసుకొన్నారో లేదో చెప్పేందుకు ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఉందా అని కోర్టు అడిగింది. వాస్తవ పరిస్థితులను గురువారం నాడు తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ అసెంబ్లీలో అన్ని సౌకర్యాలున్న కొత్త అసెంబ్లీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏమిటని విపక్షాలు కూడ ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయమై విపక్ష పార్టీలకు చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు.