ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వకపోతే ఎలా?:హెచ్ఎండీఏపై రేవంత్ పిటిషన్ పై హైకోర్టు

ఔటర్ రింగ్ రోడ్డును  30 ఏళ్ల పాటు  ప్రైవేట్ సంస్థకు హెచ్ఎండీఏ లీజుకు ఇచ్చింది. ఈ విషయమై హెచ్ఎండీఏపై  రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Telangana High Court Adjourns to on august 04 TPCC Chief Revanth Reddy  lns

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ సంస్థకు లీజు ఇవ్వడంపై   రేవంత్ రెడ్డి అడిగిన సమాచారం ఎందుకు  ఇవ్వడం లేదని  తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అయితే  రెండు వారాల సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్  హైకోర్టును  కోరారు. రేవంత్ రెడ్డి దాఖలు  చేసిన పిటిషన్ పై విచారణను  రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

ఔటర్ రింగ్ రోడ్డు ను 30 ఏళ్లకు  ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇవ్వడంపై  రేవంత్ రెడ్డి  హెచ్ఎండీఏ ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగారు. అయితే ఈ సమాచారం ఇవ్వలేదని  ఈ నెల  26వ తేదీన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  హైకోర్టు శుక్రవారంనాడు  విచారణ నిర్వహించింది.ఈ విచారణ  సందర్భంగా  హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపీ  అడిగిన సమాచారం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించింది.  ఆర్టీఐ ఉన్నది ఎందుకని హైకోర్టు అడిగింది. విపక్ష సభ్యులకు  సమాచారం ఇవ్వకపోతే చట్టసభల్లో ఏం మాట్లాడుతారని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ విషయమై తమకు  రెండు వారాల సమయం కావాలని  అడ్వకేట్ జనరల్  హైకోర్టును అడిగారు. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల  4వ తేదీకి  హైకోర్టు వాయిదా వేసింది. 

also read:ఔటర్ రింగ్ రోడ్డు లీజు: సమాచారం ఇవ్వలేదని హెచ్ఎండీఏపై హైకోర్టులో రేవంత్ పిటిషన్

రూ. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డు ను రూ. 7 వేల కోట్లకు ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.  ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థకు లీజు ఇవ్వడం వెనుక పెద్ద మతలబు ఉందని గతంలో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇదే విషయమై రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ ను సమాచారం అడిగారు. అయితే ఈ విషయమై  సమాచారం అడిగినా కూడ  సమాచారం ఇవ్వలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇదే  విషయంపై  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు  కూడ విమర్శలు  చేశారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios