తెలంగాణ గ్రూప్-3, 4 పరీక్షలపై స్టేకి హైకోర్టు నిరాకరణ: విచారణ ఈ నెల 13కి వాయిదా
తెలంగాణ గ్రూప్-3, 4 పరీక్షలపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది హైకోర్టు.
హైదరాబాద్:తెలంగాణ గ్రూప్-3, 4 పరీక్షలపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఉద్యోగ నియామాకాల ప్రక్రియను నిలిపివేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం, టీఎస్‌పీఎస్‌సీకి తెలంగాణ హైకోర్టు సోమవారంనాడు నోటీసులు జారీ చేసింది. మరో వైపు ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
గ్రూప్ 3, 4 లలో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఈ పోస్టులను తొలగించాలని 101 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భయాన్ ధర్మాసనం విచారణ నిర్వహించింది. అయితే పరీక్షలు నిర్వహించకుండా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. జీవో 55, 136 పిటిషన్లను కొట్టివేయాలని పిటిషనర్లు కోరారు. అయితే ఈ విషయమై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ , ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.