టీచర్ల బదిలీలపై స్టే ఎత్తేయాలన్న సర్కార్: విచారణ సోమవారానికి వాయిదా

టీచర్ల బదిలీలపై  విచారణపై  సోమవారంనాటికి  వాయిదావేసింది తెలంగాణ హైకోర్టు.  టీచర్ల బదిలీలపై  స్టే ఎత్తివేయాలని అడిషనల్ ఏజీ  కోర్టును  కోరారు.

Telangana High Court  Adjourns  Hearing On  Teachers  Transfers  lns

హైదరాబాద్:టీచర్ల బదిలీలపై  విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. టీచర్ల బదిలీలలపై ఉన్నస్టే ఎత్తివేయకపోవడం వల్ల  80 వేల మంది ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారని  అదనపు అడిషనల్ ఏజీ హైకోర్టు దృష్టికి తెచ్చారు. టీచర్ల బదిలీలపై పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని అదనపు ఏజీ హైకోర్టును కోరారు. టీచర్ల బదిలీలపై  ఉన్న స్టే ఎత్తివేత కోరుతూ  మధ్యంతర పిటిషన్ కూడ వేసిన విషయాన్నిఆయన  హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  స్టే ఎత్తివేయాలన్న పిటిషన్ పై  సోమవారం నాడు విచారణ జరుపుతామన్న కోర్టు తెలిపింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  టీచర్ల బదిలీల కోసం ఈ ఏడాది జనవరి 25న జీవో 5 జారీ చేసింది. ఈ జీవోను  కొందరు ఉపాధ్యాయులు  హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఉపాధ్యాయుల బదిలీలపై  తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ స్టే పొడిగిస్తూ వస్తుంది. అయితే  ఈ స్టేను  ఎత్తివేయాాలని కేసీఆర్ సర్కార్ కోరుతుంది. అయితే  ఈ  స్టేను ఎత్తివేయవద్దని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరుతున్నారు. హైకోర్టు స్టే ఉన్నందున  టీచర్ల బదిలీలపై  అనిశ్చితి కొనసాగుతుంది.  టీచర్ల బదిలీలు చేయాలని ఉపాధ్యాయుల నుండి డిమాండ్ నెలకొంది. దీంతో  రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ విషయమై  స్టే  ఎత్తివేయాలని హైకోర్టును  కోరారు. దీనిపై  సోమవారంనాడు విచారణ చేయనున్నట్టుగా  హైకోర్టు తెలిపింది.
   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios