Asianet News TeluguAsianet News Telugu

పోతిరెడ్డిపాడుపై హైకోర్టుకు కాంగ్రెస్: ఈ నెల 24కి విచారణ వాయిదా

రాయలసీమ ఎత్తిపోతల పథకం(పోతిరెడ్డిపాడు) పై తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు విచారించింది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం నాడు విచారించింది.

Telangana high court adjourned Rayalaseema lift irrigation case to august 24
Author
Hyderabad, First Published Aug 19, 2020, 1:03 PM IST

హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం(పోతిరెడ్డిపాడు) పై తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు విచారించింది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం నాడు విచారించింది.

కృష్ణా బోర్డు ఆదేశాలను కూడ పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84 ప్రకారంగా ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని ఆరోపించారు.

also read:ఇరిగేషన్ ప్రాజెక్టుల చిచ్చు: ఏపీ, తెలంగాణ వాదనలు ఇవీ..

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేయాలని కోరుతూ కూడ ఆ పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్ పై ఈ నెల 21వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ఉన్న నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.

ఈ విషయమై ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనకు హైకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు విచారణ తర్వాత కేసును విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు తెలిపింది. ఈ నెల 24వ తేదీన ఈ కేసును విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios