తెలంగాణ హెల్త్ డెరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందని వైద్యులు ప్రకటించారు.

కాగా, కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ.. ఆ తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయంలోనూ శ్రీనివాసరావు తరచుగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ ప్రణాళికల్ని చెప్పేవారు. అలాగే కోవిడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పలు సూచనలు చేసేవారు.