12 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారుల కేడర్ కేటాయింపు: నేడు తెలంగాణ హైకోర్టు విచారణ

తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న  12 మంది ఆలిండియా సర్వీస్ అధికారుల  కేడర్ కేటాయింపుల వివాదంపై  తెలంగాణ హైకోర్టు ఇవాళ  విచారణ నిర్వహించనుంది

Telangana HC to hear AIS officers cadre allotment case today

హైదరాబాద్:12 మంది  ఆలిండియా సర్వీస్ అధికారుల కేడర్  కేటాయింపుల వివాదంపై  శుక్రవారం నాడు హైకోర్టులో  విచారణ జరగనుంది.. ఈ  12 మంది ఆలిండియా  సర్వీస్ అధికారుల  కేడర్ పై  హైకోర్టు ఏ రకమైన తీర్పును ఇస్తుందోననే  సర్వత్రా  నెలకొంది.

తెలంగాణ డీజీపీ  అంజనీకుమార్  సహా  12 మంది ఆలిండియా  సర్వీస్ అధికారుల  కేడర్ పై  హైకోర్టు  తీర్పును వెల్లడించనుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు  ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను డీఓపీటీ  కేటాయించింది.  అయితే  ఏపీకి కేటాయించినా అధికారులు  కొందరు తెలంగాణలో  విధులు  నిర్వహిస్తున్నారు. దీంతో  డీఓపీటీ ఆదేశాలను  ఆలిండియా  సర్వీసెస్ అధికారులు  2016లో  క్యాట్ లో సవాల్ చేశారు. క్యాట్ ఆదేశాల మేరకు ఆలిండియా సర్వీసెస్ అధికారులు తెలంగాణలో కొనసాగుతున్నారు.  అయితే  క్యాట్ ఆదేశాలను  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది.  ఈ  పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది.ఆలిండియా సర్వీసెస్ అధికారుల  సీనియారిటీపై  కూడా హైకోర్టు విచారణ చేయనుంది.

క్యాట్ తీర్పు ఆధారంగా  ఐపిఎస్ లు అంజనీ కుమార్,అభిలాష్ భిస్త్, సంతోష్ మెహ్రా, ఏవీ రంగనాధ్ లు  తెలంగాణలో కొనసాగుతున్నారు.  మరో వైపు ఈ తీర్పు ప్రకారంగా  ఐఎఎస్ అధికారులు  వాణి ప్రసాద్, హరికిరణ్, వాకాటి కరుణ, రోనాల్డ్ రొస్, ,ఆనంతరాము, శ్రీజన,శివశంకర్, మల్లెల ప్రశాంతిలు తెలంగాణ రాష్ట్రంలోనే విధులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నిర్వహించి హైకోర్టు ఏ రకమైన తీర్పు వెల్లడిస్తుందోననే  ఉత్కంఠ నెలకొంది. 

also read:ఏపీ సీఎం జగన్‌, సీఎస్ జవహర్ రెడ్డితో సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్ భేటీ

ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్  కు తెలంగాణ కేడర్ ను  హైకోర్టు రద్దు  చేసిన విషయం తెలిసిందే . సోమేష్ కుమార్  ను ఏపీ రాష్ట్రానికి అలాట్  చేసింది . దీంతో  సోమేష్ కుమార్  ఏపీ రాష్ట్రంలో  రిపోర్టు చేశారు. డీఓపీటీ ఆదేశాలను నిరసిస్తూ  సోమేష్ కుమార్ క్యాట్ ను ఆశ్రయించారు. తెలంగాణలో నే సోమేష్ కుమార్ కొనసాగేలా  క్యాట్ ఆదేశాలు జారీ చేసింది.  ఈ ఆదేశాలను తెలంగాణ హైకోర్టులో  కేంద్ర ప్రభుత్వం సవాల్ చేసింది.  సోమేష్ కుమార్ తెలంగాణ కేడర్ ను  హైకోర్టు రద్దు చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios