Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సీఎం జగన్‌, సీఎస్ జవహర్ రెడ్డితో సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్ భేటీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో  సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్ భేటీ అయ్యారు.  హైకోర్టు ఆదేశాల మేరకు  ఏపీలో రిపోర్టు  చేసేందుకు  సోమేష్ కుమార్ ఇవాళ వెళ్లారు.

senior IAS  Officer  Somesh kumar meets  AP CM YS Jagan
Author
First Published Jan 12, 2023, 11:42 AM IST

అమరావతి: మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో  భేటీ అయ్యారు.  సోమేష్ కుమార్ కు  తెలంగాణ కేడర్ ను రద్దు చేయడంతో  ఏపీ కేడర్ అలాటైంది. సోమేష్ కుమార్ కు  తెలంగాణ కేడర్ ను అలాట్ చేస్తూ  క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను  తెలంగాణ హైకోర్టు రెండు రోజుల క్రితం  కోట్టి వేసింది.  దీంతో ఏపీ రాష్ట్రంలో రిపోర్టు చేయాలని సోమేష్ కుమార్ ను  డీఓపీటీ ఆదేశించింది. దీంతో సోమేష్ కుమార్  ఇవాళ  హైద్రాబాద్ నుండి  విజయవాడకు  వెళ్లారు.  

తొలుత  సచివాలయానికి వెళ్లి సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ తో ఆయన  భేటీ అయ్యారు. తెలంగాణలో సీఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్   హైకోర్టు ఆదేశాలతో  ఏపీకి రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన  ఏ బాధ్యతలనైనా  నిర్వహిస్తానని  సోమేష్ కుమార్ ప్రకటించారు.  వీఆర్ఎస్ తీసుకొని  తెలంగాణలో  రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా సోమేష్ కుమార్ పనిచేస్తారనే  ప్రచారం కూడ లేకపోలేదు.  అయితే ఈ విషయమై  నిర్ణయం తీసుకోలేదని  సోమేష్ కుమార్ ప్రకటించారు. 

తెలంగాణలో సీఎస్ గా పనిచేసిన  సోమేష్ కుమార్  కి  ఏపీలో  ఏ పోస్టింగ్ ఇస్తారనే  చర్చ సాగుతుంది.  ప్రస్తుతం  15 సీనియర్ ఐఎఎస్ ల పోస్టింగుల్లో మార్పులు చేర్పులు జరిగే  అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది సీఎంఓలోకి సోమేష్ కుమార్ ను తీసుకుంటారా లేదా  ఇతర శాఖలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా అనే విషయమై   ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే  అవకాశం లేకపోలేదు.

also read:ఏ బాధ్యతలు అప్పగిస్తారో?:ఏపీకి బయలుదేరిన సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో సోమేష్ కుమార్ ఏపీ రాష్ట్రానికి కేటాయించింది  డీఓపీటీ. అయితే తాను తెలంగాణలోనే ఉంటానని  సోమేష్ కుమార్ ఈ అలాట్ మెంట్ ను  సవాల్ చేశారు.  సోమేష్ కుమార్ కు  తెలంగాణ కేడర్ ను  కేటాయిస్తూ  క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను  కేంద్ర ప్రభుత్వం  2017లో  సవాల్ చేసింది.  ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు  జరిగాయి. సోమేష్ కుమార్ కు   తెలంగాణ కేడర్ ను హైకోర్టు రద్దు చేసింది. ఏపీకి వెంటనే వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.  ఈ ఆర్డర్ ను అమలు చేయడానికి మూడు వారాల సమయం కావాలని  సోమేష్ కుమార్ తరపు న్యాయవాది కోరినా కూడా  హైకోర్టు అనుమతించలేదు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios