కేటీఆర్ కు హైకోర్టులో బిగ్ షాక్ : ఫార్ములా ఈ రేస్ కేసులో FIR కొట్టివేతకు నో

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన ఫార్ములా ఈ రేస్ కేసులో FIR ను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. 

Telangana HC Dismisses KTRs Plea to Quash FIR in Formula E Race Case

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన ఫార్ములా ఈ రేస్ కేసులో FIR ను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

కేటీఆర్ ఈ FIR ను రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.

కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగియగా.. హైకోర్టు తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేసింది.  ఈ నేపథ్యంలో కేటీఆర్ వర్గం ఎఫ్ఐఆర్ ను కొట్టేసే అవకాశముందని భావించింది. తాము తీర్పు చెప్పే దాకాా కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని  కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో మంగళవారం తీర్పు వచ్చింది. ఎఫ్ఐఆర్ రద్దు కోరుతూ కేటీఆర్ వర్గం దాఖలు చేసిన పిటీషన్ ను  హైకోర్టు కొట్టివేసింది.

వెంటనే అరెస్ట్ చేయకుండా కేటీఆర్‌కు రక్షణ కల్పించాలంటూ ఆయన తరపు లాయర్లు కోరారు. దీన్ని కూడా హైకోర్టు  తోసిపుచ్చింది.

దీంతో ఈ కేసులో ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios