తెలంగాణ హరితోత్సవం: ఈ నెల 19న జూపార్క్ స‌హా రాష్ట్రంలోని అన్ని పార్కుల‌కు ఉచిత ప్ర‌వేశం

Hyderabad: తెలంగాణలో జూన్ 19న జంతుప్రదర్శనశాలలు, ఇతర ప్రధాన పార్కుల్లో ఉచిత ప్రవేశం ఉంటుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్రకృతితో పాఠశాల విద్యార్థుల అనుబంధాన్ని బలోపేతం చేయడమే హరితోత్సవం లక్ష్య సాధన కోసం అన్ని జిల్లాల అధికారులు తమ తమ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. 
 

Telangana Harithotsavam: Free entry to all parks in the state, including zoopark, on June 19th RMA

Telangana Harithotsavam: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జూ పార్కుల్లో జూన్ 19న సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ ఎం డోబ్రియాల్ శనివారం నిర్వహించిన అధికారిక సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.  ప్రకృతితో పాఠశాల విద్యార్థుల అనుబంధాన్ని బలోపేతం చేయడమే హరితోత్సవం లక్ష్య సాధన కోసం అన్ని జిల్లాల అధికారులు తమ తమ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. 

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి గ్రామం, మండలం, జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటాలని డోబ్రియాల్ అన్నారు. రుతుపవనాల రాకకు అనుగుణంగా తొమ్మిదో విడత హరితహారం ప్రారంభించి, ముమ్మరంగా చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. హరితహారం సందర్భంగా హరితహారం విజయాలను వీడియోలు, పోస్టర్ల ద్వారా చూపిస్తామని సమావేశంలో రాష్ట్ర అధికారులు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు..

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించాల‌ని ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నివాళులు అర్పించి, సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు  జూన్ 3న తెలంగాణ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతువేదికల్లో ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను వివరిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహించింది. 

మరుసటి రోజును సురక్షా డే (సేఫ్టీ డే)గా జ‌రిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని వివరిస్తూ, ప్రజాహిత పోలీసు విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర పోలీసు శాఖ కార్యక్రమాలు నిర్వహించింది. అదేవిధంగా ఇంధన శాఖ సాధించిన విజయాలను తెలియజేసేందుకు జూన్ 5న తెలంగాణ విద్యుత్ విజయోత్సవాన్ని నిర్వహించారు. జూన్ 6న తెలంగాణ ఇండస్ట్రియల్ గ్రోత్ ఫెస్టివల్, జూన్ 7న సాగునీటి దినోత్సవంగా నిర్వ‌హించి.. రాష్ట్ర సాగునీటి రంగం సాధించిన విజయాలను వివ‌రించారు. అలాగే, ఈ నెల 8న ప్రతి గ్రామంలో ఊరూరా చెరువుల పండుగను ప్రభుత్వం నిర్వహించింది. బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు దీనిలో భాగంగా నిర్వ‌హించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios