తెలంగాణ ప్రభుత్వం బుధవారం మరో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తొలుత సాయంత్రం ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ ప్రభుత్వం బుధవారం గంటల వ్యవధిలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తొలుత సాయంత్రం ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆ కాసేపటికే మరో 8 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

బదిలీ అయిన అధికారులు :

  • హైదరాబాద్ ట్రాఫిక్ 3 డీసీపీగా ధన్నరపు శ్రీనివాస్
  • హైదరాబాద్ అడ్మిన్ డీసీపీగా శిల్పవల్లి
  • మాదాపూర్ డీసీపీగా గొనే సందీప్ రావు
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ అడ్మిన్ ఎస్పీగా సురేందర్ రెడ్డి
  • భూపాలపల్లి ఎస్పీగా కరుణాకర్ 
  • ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ప్రసన్నరాణి
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ టెక్నికల్ ఎస్పీగా కే.పుష్ప
  • హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీగా కవిత


అంతకుముందు బదిలీ అయిన అధికారులు : 

  • ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్ 
  • పర్సనల్ అడిషనల్ డీజీగా సౌమ్యా మిశ్రా
  • డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి
  • హోంగార్డ్స్ డీఐజీగా అంబర్ కిషోర్
  • మేడ్చల్ డీసీపీగా శబరిష్