నయీం కేసులో పోలీసులకు ఊరట

Telangana Govt to withdraw suspensions in Nayeem case
Highlights

గ్యాంగస్టర్ నయీం కేసులో సస్పెండ్ అయిన పోలీసులకు ఊరట లభించనుంది.

హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీం కేసులో సస్పెండ్ అయిన పోలీసులకు ఊరట లభించనుంది. పోలీసులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

నయీంతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అదనపు ఎస్పీ శ్రీనివాస్ సహా ఐదుగురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వారిపై సస్పెన్షన్ ను ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వెలువడుతాయని అంటున్నారు. 

నయీం కేసులో 11 మంది పోలీసులకు చార్జ్ మెమోలు జారీ చేయగా ఆరుగురిని వివరణ కోరింది. మాఫియా డాన్ గా అవతారమెత్తిన నయీం ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. 

loader