Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్ సరఫరా నిలిపివేత... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వ్యాక్సిన్ డోసులను నిలిపివేశారు. ఈ మేరకు డీఎంహెచ్‌లకు ఆదేశాలు జారీ చేశారు డీహెచ్. అందుబాటులో వున్న వ్యాక్సిన్ డోసులను ప్రైవేట్ ఆసుపత్రులు వినియోగించుకోవచ్చని చెప్పారు. మిగిలి వున్న డోసులను తిరిగి సేకరించాలని మెడికల్ ఆఫీసర్లకు, ఫార్మాసిస్ట్‌లను ప్రభుత్వం ఆదేశించింది. 

telangana govt stops vaccine supply for private hospitals ksp
Author
Hyderabad, First Published Apr 30, 2021, 4:17 PM IST

తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వ్యాక్సిన్ డోసులను నిలిపివేశారు. ఈ మేరకు డీఎంహెచ్‌లకు ఆదేశాలు జారీ చేశారు డీహెచ్. అందుబాటులో వున్న వ్యాక్సిన్ డోసులను ప్రైవేట్ ఆసుపత్రులు వినియోగించుకోవచ్చని చెప్పారు. మిగిలి వున్న డోసులను తిరిగి సేకరించాలని మెడికల్ ఆఫీసర్లకు, ఫార్మాసిస్ట్‌లను ప్రభుత్వం ఆదేశించింది. 

కాగా, మే 1వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి వాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉంది.. దీనికి సంబంధించి ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ కూడా ప్రారంభం అయ్యింది.. అయితే. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తిస్థాయి ఆదేశాలు ఇవ్వ‌లేదు తెలంగాణ స‌ర్కార్.

Also Read:తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మరో వారం పొడిగింపు: మే 8వరకు రాత్రి కర్ఫ్యూ

18 ఏళ్లు పైబ‌డిన‌వారికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామంటూ ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు.. కానీ, పూర్తిస్థాయి ఆదేశాలు మాత్రం వెలువ‌డ‌లేదు.. ప్ర‌స్తుతం వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేష‌న్‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉండ‌గా.. అపాయింట్‌మెంట్ మాత్రం ఇప్పుడే ఇవ్వ‌డం లేదు. నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇప్పట్లో ఇవ్వలేమని స్పష్టం చేశారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios