Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మరో వారం పొడిగింపు: మే 8వరకు రాత్రి కర్ఫ్యూ

తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ప్యూను మే 8వ తేదీకి పొడిగించింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఇవాళ్టితో  ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. 

Telangana government extends night curfew till may 8 lns
Author
Hyderabad, First Published Apr 30, 2021, 2:36 PM IST

తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ప్యూను మే 8వ తేదీకి పొడిగించింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఇవాళ్టితో  ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో   ఈ నెల 20 నుండి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి.

also read:నైట్ కర్ఫ్యూ ముగుస్తోంది, మేం ఆదేశించాలా: తెలంగాణ హైకోర్టు ప్రశ్న

ఇవాళ్టితో నైట్ కర్ఫ్యూ ముగుస్తోంది. ఈ విషయమై  తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు  విచారణ నిర్వహించింది. ఈ విచారణ సమయంలో  తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.  ఇవాళ  కేసు విచారణను 45 నిమిషాల విచారణకు బ్రేక్ ఇచ్చిన తర్వాత హైకోర్టు కేసు విచారణను కొనసాగించింది.ఈ సమయంలో మరో వారం రోజుల పాటు  నైట్ కర్ఫ్యూను పొడిగిస్తామని  తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. 

 

ఇవాళ విచారణ సమయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. మా సహనాన్ని పరీక్షిస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. తలపై గన్ గురిపెడితే తప్ప నిర్ణయాలు తీసుకోరా అని హైకోర్టు ప్రశ్నించింది.  ప్రభుత్వం నిర్ణయం  తెలపకపోతే పరిస్థితి వేరేలా ఉండేదని హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఇంకా ఏమైనా ఎన్నికలు ఉన్నాయా అని హైకోర్టు అడిగింది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయని  తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.  ఈ విషయమై విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. 


నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవడం తమ ఉద్దేశ్యం కాదని కోర్టు  తెలిపింది. ప్రభుత్వ అభిప్రాయం చెప్పేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చింది హైకోర్టు.  మధ్యాహ్నం తిరిగి హైకోర్టు ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలని తెలపాలని హైకోర్టు కోరింది.  గతంలో కూడ కరోనా కేసుల విషయమై  తెలంగాణ ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ లేదా వీకేండ్ లాక్ డౌన్ ల గురించి ప్రశ్నించింది. ఈ విషయమై నిర్ణయం తీసుకోకపోతే  తాము ఆదేశాలు ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 20 నుండి రాష్ట్రంలో ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.  


 

Follow Us:
Download App:
  • android
  • ios