కరోనా చికిత్సకు సంబంధించి హైదరాబాద్‌లో 26 ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం వాటిలో మూడు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే మాదాపూర్‌లోని ఓ ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బషీర్‌బాగ్, సికింద్రాబాద్, నాగోల్‌లలో ఒక్కో ఆసుపత్రికి నోటీసులు ఇచ్చారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.