తెలంగాణ రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రైతు బంధు పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిధులు విడుదల చేసింది. రూ.6900కోట్లు విడుదలచేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ లోని రైతులందరికీ పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4వేలు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం నిధులు విడుదల చేశారు. తాజాగా ఆ మొత్తాన్ని ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఆ హామీ అనుసరించి.. రైతులందరికీ ఎకరానికి రూ.5వేలు నగదు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.  త్వరలో వర్షాకాల సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సాయాన్ని రైతులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ఈ రోజు నిధులు మంజూరు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్‌ ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోంది

. ఈ నెల 7, 8 తేదీల్లో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల పరోక్ష ఎన్నిక జరిగిన అనంతరం రైతుబంధు సాయాన్ని పంపిణీచేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మొత్తాన్ని విడుదల చేసే తేదీలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.