Asianet News TeluguAsianet News Telugu

నర్సింగ్ విద్యార్ధులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త... 5204 స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

రాష్ట్రంలో ఖాళీగా వున్న 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు.. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 

telangana govt release notification for 5204 staff nurse posts
Author
First Published Dec 30, 2022, 5:56 PM IST

తెలంగాణలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నర్సింగ్ విద్యార్ధులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా వున్న 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు జరుపుతామని వెల్లడించింది. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు.. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

 

 

ఇకపోతే.. గురువారం గ్రూప్ 2 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపింది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్ 4 నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువులు భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. అటు పోలీస్ శాఖలోనూ రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. 

ALso REad: నిరుద్యోగులకు శుభవార్త... 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఇదిలావుండగా.. డిసెంబర్ 9న  1,392 లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 2008లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో 1100 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి నోటిఫికేషన్‌గా నిలిచింది. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 

ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా వున్న 1147 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 20న ఉదయం 10.30 గంటల నుంచి జనవరి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపింది. మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. అనస్థీషియాలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 తదితర విభాగాల్లో అత్యధిక ఖాళీలు వున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios