ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (national capital region) పరిధిలో ఉన్న రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) తెలుగు (regional rapid transit system) రాష్ట్రాల్లో అడుగుపెట్టనుంది. తొలి దశలో హైదరాబాద్ - వరంగల్ (hyderabad- warangal), మలి దశలో హైదరాబాద్ - విజయవాడల (hyderabad - vijayawada) మధ్య ఈ ట్రాన్సిట్ కనెక్టివిటీ అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (national capital region) పరిధిలో ఉన్న రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్) తెలుగు (regional rapid transit system) రాష్ట్రాల్లో అడుగుపెట్టనుంది. ఇందుకు సంబంధించి వేగంగా పనులు జరుగుతున్నాయి. తొలి దశలో హైదరాబాద్ - వరంగల్ (hyderabad- warangal), మలి దశలో హైదరాబాద్ - విజయవాడల (hyderabad - vijayawada) మధ్య ఈ ట్రాన్సిట్ కనెక్టివిటీ అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలను ప్రచురిస్తోంది.
ప్రస్తుతం ఢిల్లీ- ఘజియాబాద్ - మీరట్ (delhi ghaziabad meerut rrts corridor) మార్గంలో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (ఆర్‌ఆర్‌టీఎస్) నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆర్‌ఆర్‌టీఎస్ విధానం రెగ్యులర్ రైల్వే నెట్‌వర్క్, సబర్బన్ మెట్రో రైల్‌లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రెండు నగరాల మధ్య వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్‌లను, కంట్రోల్ సిస్టమ్‌లను నిర్మిస్తారు. ఈ మార్గంలో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.
ప్రస్తుతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని ఢిల్లీ (delhi) నుంచి హర్యానా (haryana) , ఉత్తర్‌ప్రదేశ్ (uutar pradesh), రాజస్థాన్‌లలో (rajasthan) పలు నగరాలను కలుపుతూ మూడు కారిడార్లలో ఆర్‌ఆర్‌టీఎస్ పనులు సాగుతున్నాయి. ఈ మేరకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్సిట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు ఈ ట్రాన్సిట్ సిస్టమ్‌కు నిధులు సమకూరుస్తున్నాయి. దీనిని గమనించి తెలంగాణ సర్కార్.. ఆర్‌ఆర్‌టీఎస్‌ను ఇక్కడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దీనికి సంబంధించి వివిధ విభాగాల అధికారులు ఆర్‌ఆర్‌టీఎస్‌కి సంబంధించి అంచనా వ్యయం, వనరుల లభ్యత తదితర అంశాలపై పూర్తి వివరాలను అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే తెలంగాణ అధికారుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. వీరు సమర్పించే నివేదిక ఆధారంగా ఈ ప్రాజెక్టు భవిష్యత్ ఆధారపడనుంది.
కాగా.. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ పార్క్‌ని (textile park) ఇటీవల వరంగల్‌లో ప్రారంభించారు. వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నిర్మిస్తున్నాయి. అయితే వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌ఆర్‌టీఎస్ వంటి నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ - వరంగల్‌ల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. పారిశ్రామికంగా ఎదిగేందుకు వరంగల్‌కు ఇది ఎంతో దోహదపడుతుంది.
