Asianet News TeluguAsianet News Telugu

సమ్మె ఎఫెక్ట్: జూడాల స్టైఫండ్ భారీగా పెంపు.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

జూడాల సమ్మె నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్‌ను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ రెసిడెంట్లకు 70 వేల నుంచి 80,500కు పెంచింది. జనవరి 1 నుంచి పెరిగిన స్టైఫండ్ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 

telangana govt hikes junior doctors stipend ksp
Author
Hyderabad, First Published May 27, 2021, 4:59 PM IST

జూడాల సమ్మె నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్‌ను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ రెసిడెంట్లకు 70 వేల నుంచి 80,500కు పెంచింది. జనవరి 1 నుంచి పెరిగిన స్టైఫండ్ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

అంతకుముందు జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే లిఖిత పూర్వక హామీ ఇవ్వకపోవడంపై మాత్రం జూడాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లిఖిత పూర్వక హామీ కావాలని వారు పట్టుబడుతున్నారు. సమ్మె విరమణపై సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నారు జూడాలు. 

Also Read:మరోసారి తెలంగాణ సర్కార్ చర్చలు: హెల్త్ సెక్రటరీతో జూడాల భేటీ

కాగా, జూనియర్ డాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. బుధవారం నాడు ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో గురువారం నాడు మరోసారి ప్రభుత్వంతో జూడాలు చర్చించనున్నారు.తెలంగాణ హెల్త్ సెక్రటరీ రిజ్వీ పిలుపు మేరకు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తరపున ప్రతినిధులు ఇవాళ  చర్చల్లో పాల్గొన్నారు. కరోనా రోగులకు చికిత్స చేస్తూ మృతి చెందే వైద్య ఆరోగ్య సిబ్బందికి పరిహారం చెల్లింపు విషయంతో పాటు  నిమ్స్ లో వైద్య ఆరోగ్య సిబ్బంది కుటుంబసభ్యులకు చికిత్స అందించాలని జూడాలు పట్టుబడుతున్నారు. 

ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత వస్తే తాము తిరిగి విధుల్లో చేరుతామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఈ నెల 10వ తేదీనే డీఎంఈకి జూడాలు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో జూడాలు సమ్మెకు దిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios