రాష్ట్రంలోని గురుకులాలు , అనుబంధ హాస్టళ్ల డైట్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన డైట్ చార్జీలు జూలై నుంచి అమలు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది.
రాష్ట్రంలోని గురుకులాలు , అనుబంధ హాస్టళ్ల డైట్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డైట్ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం 3 నుంచి 7వ తరగతి వరకు డైట్ ఛార్జ్‌లను రూ.1200కు.. 8 నుంచి 10 తరగతుల విద్యార్ధులకు రూ.1400.. ఇంటర్ పీజీ విద్యార్ధులకు రూ.1875గా పెంచారు. పెరిగిన డైట్ చార్జీలు జూలై నుంచి అమలు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
