Asianet News TeluguAsianet News Telugu

Dalit Bandhu: దళిత బంధు రెండో విడుతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..  ఈసారి ఎంత మంది లబ్ది పొందనున్నరంటే..?

Dalit Bandhu: దళిత బంధు రెండో విడుతకు  తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.30 లక్షల మందికి  దళిత బంధు అందించనున్నారు.

Telangana govt gives nod for Dalit Bandhu-II programme KRJ
Author
First Published Jun 25, 2023, 12:46 AM IST

Dalit Bandhu: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం ద్వారా దళితులు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే పలు రాష్ట్రాలు, పలు సంస్థలను నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తొలి విడతను  విజయవంతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా  రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవ్వాల (శనివారం) రాత్రి తెలంగాణ సర్కార్ జీవో  విడుదల చేసింది.  

జీవో ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే.. 118 నియోజకవర్గాలలో 1,29,800 మందికి దళిత బంధు అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. నిబంధల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు  సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో సంప్రదించి అసెంబ్లీ నియోజకవర్గానికి (హుజూరాబాద్ మినహా) 1100 ఎస్సీ కుటుంబాలను గుర్తించాలని ఆదేశించింది.

ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు ఇచ్చారు. హుజురాబాద్​ ఉపఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ దళిత బంధు అనే పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా​ప్రకటించారు. ఆ ప్రాంతంలో దాదాపు 14,400 మంది ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios