రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్సులను తెలంగాణ ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానంలో లైసెన్స్‌దారులను ఎంపిక చేయాల్సి ఉంది.

దీనికి సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసినట్లుగా తెలుస్తోంది.

అధికారుల నివేదికను పరిశీలించిన మీదట మద్యం దుకాణాల లైసెన్సుల గడువుల 2019 అక్టోబర్ 1 నుంచి 31 వరకు పోడిగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ నిర్ణయం కారణంగా ప్రస్తుతం ఉన్న 2,216 మద్యం దుకాణాలు నెల రోజుల పాటు యథాతథంగా కొనసాగునున్నాయి.