పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలు కోరుట్ల డివిజన్‌లో... కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లపల్లి మండలాలతో కొల్లాపూర్ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.