Asianet News TeluguAsianet News Telugu

Konijeti Rosaiah Death: తెలంగాణలో మూడు రోజులు సంతాప దినాలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై (Konijeti Rosaiah Death) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సంతాపం తెలిపింది. మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది.

Telangana Govt declared 3 days of State mourning following the demise of ex cm Konijeti Rosaiah
Author
Hyderabad, First Published Dec 4, 2021, 11:58 AM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతిపై (Konijeti Rosaiah Death) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సంతాపం తెలిపింది. మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. డిసెంబర్ 4,5,6 తేదీలను సంతాప దినాలు పాటించాలని ఆదేశించింది. రోశయ్య అంత్యక్రియను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయింది. ఇక, రేపు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్తానంలో రోశయ్య అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 

రోశయ్య మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం.. 
రోశయ్య మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. పలు పదవులకు కొణిజేటి రోశయ్య వన్నె తెచ్చారని కేసీఆర్ అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా తనదైన శైలిని ప్రదర్శించారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Also read: Konijeti Rosaiah Death: రేపు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు.. ప్రజల సందర్శనార్ధం గాంధీభవన్‌కు భౌతికకాయం..

రోశయ్యకు తెలంగాణ మంత్రుల నివాళులు..
తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన ఉమ్మడి ఏపీలో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

మంత్రి కేటీఆర్ సంతాపం.. 
కొణిజేటి రోశ‌య్య మ‌ర‌ణం బాధాక‌ర‌మ‌ని మంత్రి కేటీఆర్ (KTR condolence on rosaiah death) తెలిపారు. ఓ సంద‌ర్భంలో రోశ‌య్య‌తో దిగిన ఫోటోల‌ను మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో పోస్టు చేశారు. రోశ‌య్య ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో చెప్పారు.

Also read: Konijeti Rosaiah Death: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత..
మాజీ సీఎం రోశయ్య మృతిపై తెలంగాణ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత విచారం వ్య‌క్తం చేశారు. రోశ‌య్య కుటుంబ స‌భ్యుల‌కు, వారి అభిమానుల‌కు ఆమె ప్ర‌గాఢ సంతాపం ప్ర‌క‌టించారు. ఎన్నో కీల‌క ప‌ద‌వుల‌ను అలంక‌రించిన రోశ‌య్య ఎంతో మందికి ప్రేర‌ణ‌గా నిలిచార‌ని, ఆయ‌న‌ మ‌ర‌ణం వారంద‌రిలో తీవ్ర విషాదాన్ని నింపిన‌ట్లు ఎమ్మెల్సీ క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

రోశయ్య కన్నుమూత..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి  2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios