Asianet News TeluguAsianet News Telugu

ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు.. సర్వీస్ రూల్స్‌లో తెలంగాణ సర్కార్ మార్కులు, ప్రతి పదో ఉద్యోగం వారికే

షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)లకు రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సబార్డినేట్ రూల్స్‌లో మార్పులు చేసింది. దాంతో నియామకాల్లో ప్రతి పదో ఉద్యోగం ఎస్టీలకు దక్కనుంది. 

telangana govt changed subordinate service rules
Author
First Published Nov 9, 2022, 7:11 PM IST

ప్రభుత్వ ఉద్యోగాల్లో సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేసింది తెలంగాణ సర్కార్. ఎస్టీ రిజర్వేషన్లు పెంచడంతో అందుకు అనుగుణంగా సవరణలు చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను ఇటీవల 6 నుంచి పది శాతానికి పెంచిన ప్రభుత్వం.. తాజాగా రోస్టర్ పాయింట్ ఖరారు చేసింది. దాంతో నియామకాల్లో ప్రతి పదో ఉద్యోగం ఎస్టీలకు దక్కనుంది. 

కాగా.. తెలంగాణలో షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)లకు రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 1న ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం జీవో నంబర్‌ 33 జారీ చేసింది.  శనివారం (అక్టోబరు 1) నుంచి పెరిగిన కొత్త రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. చెల్లప్ప కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణలోని తీసుకుని.. వారికి రిజర్వేషన్లు పెంచుతున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

తాజా ఉత్తర్వుల్లో రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియమాకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. ఎస్టీలకు 10, ఎస్సీలకు 15, బీసీలకు 29, ఈడబ్ల్యూఎస్‌‌కు 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. సీఎం కేసీఆర్ శుక్రవారం యాదాద్రి పర్యటన ముగించుకుని ప్రగతిభవన్‌కు చేరుకున్న వెంటనే.. ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ALso REad:గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు.. నేటి నుంచే అమల్లోకి.. అర్దరాత్రి జీవో జారీ చేసిన సర్కార్..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు 6శాతంగా ఉన్న రిజర్వేషన్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా కొనసాగిస్తూ వచ్చారు. అయితే గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం.. రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నిక మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని ఉంచారు. అలాగే..  రిజర్వేషన్ల పెంపు అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చెల్లప్ప నేతృత్వంలో కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికకు 2017లో తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది.  

అలాగే ముస్లింలకు అప్పటిదాకా ఉన్న 4 శాతం రిజర్వేషన్‌ను కూడా 12 శాతానికి పెంచుతూ ప్రతిపాదించింది. ఆ సమయంలో తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లను 62కి పెంచాలని ప్రతిపాదించింది. ఆ బిల్లును పాస్ చేసే సమయంలో తమిళనాడులో మొత్తం రిజర్వేషన్లు 69 శాతం ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుచేసింది. అయితే ఆరేళ్లు గడిచిన ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లు బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపలేదు. రాష్ట్రపతి ఆమోదానికి పంపలేదు. ఈ క్రమలోనే ఎస్టీ కోటా రివిజన్‌పై కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరిస్తుందని ఆరోపించిన సీఎం కేసీఆర్.. రాష్ట్రం తన ప్రతిపాదనతో ముందుకు సాగుతుందని ప్రకటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios