Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ: గురుకులాల్లో ఇంటర్ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు.. సీట్ల కేటాయింపు ఇలా..!!

గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఆర్‌జేసీ సీఈటీ 2021 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సీజీపీఏ, గ్రేడింగ్ ఆధారంగానే గురుకులాల్లో సీట్లను కేటాయిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

telangana govt cancels rjc cet 2021 ksp
Author
Hyderabad, First Published Jun 2, 2021, 3:20 PM IST

గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఆర్‌జేసీ సీఈటీ 2021 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సీజీపీఏ, గ్రేడింగ్ ఆధారంగానే గురుకులాల్లో సీట్లను కేటాయిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 7 వరు ఆన్‌లైన్‌లో సీజీపీఏ గ్రేడింగ్ అప్‌లోడ్‌కు అవకాశం కల్పించింది. అడ్మిషన్ వివరాలకు వెబ్‌సైట్ www.tswreis.in సంప్రదించాలని సూచించింది. 

కాగా, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. 

Also Read:సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు.. విద్యార్ధుల ఆరోగ్యమే ముఖ్యం: మోడీ

కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేయడంతో పాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 14న నిర్ణయం తీసుకొంది.  సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేయాలని అప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఆనాటి సమీక్ష సమావేశంలో టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ప్రధాని  మోడీ  నిర్ణయం తీసుకొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios