రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు..
సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు తమ శాఖలపై వరుస రివ్యూలు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారుల బదిలీలు, పోస్టింగ్ ల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే పలు దఫాలుగా ఐఏఎస్ లను బదిలీ చేయగా.. తాజాగా మరోసారి ఐఏఎస్ ల బదిలీ చేపట్టింది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ జరిగిన బదిలీలల్లో కొందరికీ ప్రమోషన్.. మరికొందరికీ డిమోషన్ జరిగినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరికొంతమంది అధికారుల బదిలీలు జరిగే అవకాశం లేకపోలేదు.
తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగజావుగా జరిగేందుకు పలు కీలక చర్యలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితాలు ప్రజలకు చేరేలా అధికారులను బదిలీ చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినా రాష్ట్రప్రభుత్వం తాజాగా మరోసారి ఐఏఎస్ ల బదిలీ చేపట్టింది. ఈ సారి ఆరుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆమోదముద్ర వేసింది.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ పార్లమెంటరీ కార్యదర్శి- ఎన్ శ్రీధర్, IAS (1997),
పశుసంవర్థక శాఖ జాయింట్ (AH, DD & F) సెక్రటరీ- D అమోయ్ కుమార్, IAS (2013),
వైద్యశాఖ ( HM & FW) డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రటరీ - T వినయ్ కృష్ణ రెడ్డి, IAS (2013)
టీఆర్ అండ్ బీ శాఖ సంయుక్త కార్యదర్శి -ఎస్ హరీష్ IAS (2015)
టీఎస్ ఐఆర్డీ సీఈవో (TSIRD CEO)- పి కాత్యాయని దేవి, IAS (2017),
మైన్స్ & జియాలజీ డైరెక్టర్ - సుశీల్ కుమార్ (నాన్-క్యాడర్)
అంతకుముందు.. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3న ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో సహా రాష్ట్రంలోని 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే..