భద్రాచలంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటిస్తున్నారు. మిథిలా స్టేడియంలో శ్రీరాముని పట్టాభిషేమహోత్సవంలో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు. తనను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. 

భద్రాచలం : Bhadrachalamలో రాష్ట్ర గవర్నర్ Tamilisai Soundararajan పర్యటన కొనసాగుతోంది. గవర్నర్ పర్యటనలో మరోసారి Protocol వివాదం నెలకొంది. గవర్నర్ పర్యటనకు కలెక్టర్, ఎస్పీ గైర్హాజరయ్యారు. మరోవైపు భద్రాద్రి పర్యటనలో భాగంగా సీతారామస్వామిని తమిళిసై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మిథిలా స్టేడియంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.

కాగా, ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు. సోమవారం గవర్నర్ దంపతులు సీతారాముల స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తమిళిసై మాట్లాడుతూ భక్త రామదాసు నిర్మించిన ఆలయాన్ని, సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. 

ఇదిలా ఉండగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఈరోజు ఉదయం సికింద్రాబాద్ నుంచి భద్రాద్రికి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున రైలులో కొత్తగూడెం రైల్వే స్టేషన్కు చేరుకున్న గవర్నర్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలోభద్రాద్రి చేరుకున్నారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో జరగుతున్న శ్రీ సీతారాముల పట్టాభిషేకం వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు ఆహ్వానం లభించడం సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. 

కాగా, ఏప్రిల్ 7న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆమె తెలంగాణలో ప్రోటోకాల్ వివాదం, ప్రస్తుత పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాశ్యలు చేశారు. వివిధ అంశాలతో అమిత్ షాతో చర్చించానని తెలిపారు. అమిత్ షాతో చర్చించిన విషయాలు బయటకు చెప్పలేనని అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తానని చెప్పారు. తెలంగాణలో తాను రైలు, రోడ్డు మార్గంలో మాత్రమే ప్రయాణించగలను అని అన్నారు. ఎందుకో మీరే అర్థం చేసుకోండని మీడియాతో అన్నారు.

అంతేకాదు తన విషయంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలకు తెలుసునని అన్నారు. తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని చెప్పారు. తాను అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తినని తెలిపారు. రాజ్ భవన్ తెలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సీఎం, మంత్రులు, సీఎస్ రాజ్ భవన్ కు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. తనతో సమస్య ఉంటే ఎవరైనా వచ్చి చర్చించవచ్చు అని చెప్పారు. 

యాదాద్రి ఆలయాన్ని తన కుటుం సమేతంగా దర్శించుకున్నట్టుగా చెప్పారు. యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ తనను కలవలేదని చెప్పారు. యాదాద్రికి తాను బీజేపీ వ్యక్తిగా వెళ్లానని వాళ్లు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. రెండేళ్లలో తాను బీజేపీ నాయకులను కేవలం ఒకటి, రెండుసార్లే కలిశానని తెలిపారు. తమిళిసైని కాకపోయినా రాజ్ భవన్ ను గౌరవించాలన్నారు. తాను ఎవరినీ విమర్శించట్లేదని చెప్పారు. తెలంగాణలో రాజ్ భవన్, గవర్నర్ విషయంలో ఏం జరుగుతందో మాత్రమే చెబుతున్నానని అన్నారు.